manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 11:19 am Editor : Mana Praja Prathinidhi

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి స్వాగతం పలికిన బీజేపీ హుస్నాబాద్ పట్టణ నాయకులు

హుస్నాబాద్//మనప్రజాప్రతినిధి. 13

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ శ్రీ కొత్త కొండ వీరభద్ర స్వామి దర్శనానికి వెళ్తున్న సందర్భంగా ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు హుస్నాబాద్ పట్టణ నాయకులతో కలిసి బండి సంజయ్ కుమార్ గారిని స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. స్వాగతం పలికిన వారిలో  బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు బోడిగే వెంకటేష్, వేల్పుల నాగార్జున్, ప్రధాన కార్యదర్శి గాదాసు రాంప్రసాద్, కార్యదర్శి వడ్డెపల్లి లక్ష్మయ్య, బొప్పిశెట్టి సాయిరామ్, కోశాధికారి బుర్ర రాజు, శక్తి కేంద్ర ఇంచార్జీ నారోజు నరేష్, బీజేపీ సీనియర్ నాయకులు బోనగిరి రవి, తోట సమ్మయ్య, కాయిత అరుణ్ రెడ్డి, వరియోగుల అనంతస్వామి,ఆశాడపు శ్రీనివాస్, బీజేపీ నాయకులు దొంతరబోయిన సాంబరాజు, నాయకులు పాల్గొన్నారు.