గుట్టకింది గ్రామంలో పెద్దమ్మకు ఘనంగా బోనాల పండుగ
•ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోతరాజు ప్రవీణ్ ప్రత్యేక ఆకర్షణమెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//జనవరి31మెదక్ జిల్లా పరిధిలోని గుట్టకింది గ్రామంలో శుక్రవారం గ్రామ దేవత పెద్దమ్మకు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతరాజు ప్రవీణ్ ప్రత్యేక వేషధారణతో బోనాలు తీసి గ్రామస్తులను ఆకట్టు కున్నారు.పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు బోనాలు సమర్పించి, పురుషులు డప్పులు,వాయిద్యాలతో అమ్మవారి మహిమను కీర్తించారు. భక్తుల “జై పెద్దమ్మ” నినాదాలతో గ్రామం మార్మోగింది.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మహేష్, ఉపాధ్యక్షులు...