అభివృద్ధి పేరుతో అప్పులు ,రేపటి తరాలకు భారం కాదా…
మనప్రజాప్రతినిధి//జనవరి06: అభివృద్ధి అనేది ప్రతి ప్రభుత్వానికి తప్పనిసరి లక్ష్యం. దేశం ముందుకు సాగాలంటే రహదారులు, వంతెనలు, పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్ ప్రాజెక్టులు అవసరమే. కానీ ఈ అభివృద్ధి మొత్తం అప్పుల మీద ఆధారపడితే, అది నిజమైన ప్రగతేనా? లేక భవిష్యత్తును తాకట్టు పెట్టి సాధించిన తాత్కాలిక వెలుగేనా? అనే ప్రశ్నలు ఈరోజు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే నేటి పాలకులు తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాల ప్రభావం రేపటి తరాలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది.- అభివృద్ధి అవసరమే… కానీ అప్పుల పరిమితి ఎక్కడ?ప్రభుత్వాలు అప్పులు...