వీఐపీ కల్చర్‌కు బ్రేక్… మహాశివరాత్రి రోజున సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం!
•వీఐపీ దర్శనాలకు పరిమిత సమయం…శివరాత్రి రోజున సామాన్య భక్తులకే ప్రధాన ప్రాధాన్యం•మహాశివరాత్రికి భక్తులకే తొలి ప్రాధాన్యం ఎర్పేడుమండలం,జనవరి20(మనప్రజాప్రతినిధి):రానున్న మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయంలో సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ ఆలయ పాలకమండలి కీలక, చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేవస్థానం చైర్మన్ బత్తల నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శివరాత్రి ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనలతో వీఐపీ దర్శనాలకు పరిమిత సమయాన్ని మాత్రమే కేటాయిస్తూ, ఉదయం 5 గంటల నుంచి 9...