manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 1:54 am Editor : Mana Praja Prathinidhi

కాంగ్రెస్ హామీలకు భయపడుతున్న బిఆర్ఎస్ – జగ్గారెడ్డిపై విమర్శలు

పేదల ఇళ్ల స్థలాల ప్రకటనపై ఓర్వలేక జగ్గారెడ్డిపై బిఆర్ఎస్ విమర్శలు.
ఇళ్ల స్థలాల హామీతో బిఆర్ఎస్‌లో అలజడి-జగ్గారెడ్డిపై విమర్శల వర్షం.•బిఆర్ఎస్ నేతల తీరుపై కాంగ్రెస్ మండిపాటు
సదాశివపేట,జనవరి13(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మంగళ వారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో బిఆర్ఎస్ నాయకులు ఇటీవల నిర్వహించిన విలేకరులసమావేశంలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని జగ్గారెడ్డి ప్రకటించడంతో, దానిని ఓర్వలేక బిఆర్ఎస్ నాయకులు ఆయనపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇటువంటి విమర్శలు మానుకోవాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మునిపల్లిసత్యనారాయణ బిఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు.గత పదేళ్ల కాలంలో రేషన్ కార్డుల సమస్యపై ఒక్కసారి కూడా అప్పటి ఎమ్మెల్యే స్పందించలేదని, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం తగదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రైతు భరోసా, గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలను ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు.ఈ పథకాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందడంతో, బిఆర్ఎస్ నాయకులకు ఏం చేయాలో తెలియక కాంగ్రెస్‌పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి మాలిన్యపు రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పిల్లోడి విశ్వనాథం, కొత్తగుళ్ల శేఖర్, శంకర్ గౌడ్, నాగరాజు గౌడ్, గుండు రవి, రాయపాడు రమేష్, విష్ణువర్ధన్ రెడ్డి, శరత్ చంద్ర, వాజిద్, సజ్జి, రాములు గౌడ్, లతీఫ్, వీరన్న, హైటెక్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.