కాంగ్రెస్ బాకీల పాలనకు బీఆర్‌ఎస్ హెచ్చరిక!
•23వ వార్డులో కాంగ్రెస్ బాకీ కార్డులతో ప్రజాగర్జన •పేదల్ని మోసం చేసిన రేవంత్ సర్కార్‌కు బుద్ధి చెప్పాలి-ఎగమామిడి గణేష్సదాశివపేట,జనవరి21(మనప్రజాప్రతినిధి):కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమం అగ్రస్థానంలో ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల జీవితం అస్తవ్యస్తమైందని బీఆర్‌ఎస్ నాయకుడు ఎగమామిడి గణేష్ మండిపడ్డారు. సదాశివపేట పట్టణంలోని 23వ వార్డులో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత ప్రచారంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేస్తూ, ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టిన ఆరు గ్యారంటీల...