బీఆర్‌ఎస్ పార్టీ బాకీ కార్డులు ప్రతి ఇంటికి చేరవేయాలి
•బీఆర్‌ఎస్ ఎన్నికల అబ్జర్వర్ మఠం బిక్షపతిసదాశివపేట,జనవరి19(మనప్రజాప్రతినిధి):సదాశివపేట పట్టణంలో సోమవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ ఎన్నికల అబ్జర్వర్, మాజీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు.మహిళలకు నాలుగు నెలలుగా పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేశారని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడంతో పాటు ఐదు లక్షలు ఇస్తామన్న హామీని కూడా మర్చిపోయారని ఆరోపించారు....