మనప్రజాప్రతినిధి//సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం
డీజీపీ చేతుల మీదుగా నగదుబహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకున్న సూర్యాపేట జిల్లా సైబర్ వారియర్స్.
సైబర్ వారియర్స్ ను అభినందించిన ఎస్పి నరసింహ ఐపిఎస్ .
సైబర్ నేరాల నియంత్రణలో ప్రతిభ చూపిన సూర్యాపేట జిల్లా పోలీస్ సైబర్ వారియర్స్.సైబర్ మోసానికి గురైన నగదును తిరిగి బాధితుల ఖాతాలో జమ చేయడంలో, కేసులను త్వరగా చేదించడం, సైబర్ నేరాల నియంత్రణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రతిభ చూపి బాగా పనిచేసిన సూర్యాపేట పట్టణ పి ఎస్ సైబర్ వారియర్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కోదాడ పట్టణ పి ఎస్ సైబర్ వారియర్ కానిస్టేబుల్ శివకుమార్, సూర్యాపేట రూరల్ పిఎస్ సైబర్ వారియర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లులకు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రోజున జిల్లా పోలీసు కార్యాలయం నందు ఎస్పి నరసింహ ఐపిఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసినారు. ఎస్పి సిబ్బంది అభినందించి శుభాకాంక్షలు తెలిపినారు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ విభాగం ఆద్వర్యంలో తెలంగాణ నందు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఐపీఎస్, సైబర్ సెక్యూరిటీ అడిషనల్ డీజీ షికా గోయల్ ఐపిఎస్ చేతులమీదుగా ప్రశంసా పత్రాలు అందించారు. సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ ఆధ్వర్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ నందు సైబర్ వారియర్స్ పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు అందుకున్న జిల్లా సైబర్ వారియర్ కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అభినందించి, భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. సైబర్ నేరాల నియంత్రణలో సూర్యాపేట జిల్లా పోలీసుల కృషి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం పట్ల జిల్లా పోలీసు విభాగం హర్షం వ్యక్తం చేసింది.
ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది ఉన్నారు.