manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 1:52 pm Editor : Mana Praja Prathinidhi

ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లకు సర్టిఫికెట్ల అందజేత<br>తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్-శ్రీ బక్కి వెంకటయ్య

•ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంపొందింపు-భక్కి వెంకటయ్య
భూంపల్లి.మనప్రజాప్రతినిధి//జనవరి2
జాతీయ సేవా పథకం (NSS) విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ భక్కి వెంకటయ్య అన్నారు.
ఈరోజు భూంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులచే నిర్వహించబడుతున్న జాతీయ సేవా పథకం (NSS) కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ భక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- జాతీయ సేవా పథకం అనేది విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించే, స్వచ్ఛంద సమాజ సేవ ద్వారా వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే ప్రభుత్వ కార్యక్రమం అని తెలిపారు. విద్యార్థులు గ్రామాలు లేదా మురికివాడలను దత్తత తీసుకుని, అక్కడి అవసరాలకు అనుగుణంగా పరిశుభ్రత, విద్య, ఆరోగ్య అవగాహన, విపత్తు సహాయం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ“సేవ ద్వారా విద్య” అనే నినాదంతో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడం గర్వకారణమని అన్నారు.అలాగే విద్యార్థులు తాము సేవలందించి నందుకు సర్టిఫికెట్ ను అందశారు. అనంతరం సమాజాన్ని, అక్కడిసమస్యలను అవగాహన చేసుకోవడం ద్వారా సామాజిక-పౌర బాధ్యతలు, నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు అలవరుచుకుంటారని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకం నిర్మూలన, హానికరమైన వ్యర్థ పదార్థాల వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో విద్యార్థులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు.కార్యక్రమం అనంతరం చైర్మన్ భక్కి వెంకటయ్య గారిని, సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌లను శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక సి ఐ శ్రీనివాస్ మండల విద్యాధికారి దోమకొండ అంజయ్య, సర్పంచ్ జన్నారెడ్డి, ఉపసర్పంచ్ బాల్షెట్టి అనూష నందం, వార్డు సభ్యులు, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ సత్యవతి, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.