manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 6:36 am Editor : Mana Praja Prathinidhi

మెదక్ జిల్లా భుజరంపేట్‌లో ఘనంగా చింతల మనితేజ్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు

మనప్రజాప్రతినిధి//మెదక్.జనవరి13.

మెదక్ జిల్లా భుజరంపేట్ గ్రామానికి చెందిన చింతల మనితేజ్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు గ్రామంలో ఘనంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని మనితేజ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.మనితేజ్ జన్మదిన వేడుకల్లో తల్లి చింతల లలిత, తండ్రి శ్రీశైలం ముఖ్యంగా పాల్గొని ఆశీర్వాదాలు అందజేశారు. అన్నయ్యలు శివ, రాజు, అక్క అశ్విని సైతం పాల్గొని సోదరుడికి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే జేజరి సరిత, జేజరి ఆంజనేయులు, జేజరి ఏవన్, కుర్తివాడ శ్యామల, కుర్తివాడ శేఖర్ తదితర కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని వేడుకను మరింత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధి జర్నలిస్టు మెదక్ జిల్లా రిపోర్టర్‌తో పాటు పలువురు గ్రామ ప్రముఖులు, యువకులు పాల్గొని మనితేజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వేడుక వాతావరణం ఉత్సాహంగా, ఆనందంగా కొనసాగింది.