manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 3:25 pm Editor : Mana Praja Prathinidhi

ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్

మనప్రజాప్రతినిధి//తిరుపతిజిల్లా.జనవరి7
ఫ్లెమింగో ఫెస్టివల్–2026 నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బీవీ పాలెం ప్రాంతంలో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బోట్లు సహా ఇతర మౌలిక సదుపాయాలను ఆయన అధికారు లతో కలిసి పరిశీలించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్సీ, వెంకటగిరి డీఎఫ్‌ఓ శ్రీకాంత్, ఆర్డీవోలు శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి, సూళ్లూరుపేట కిరణ్మయి, టూరిజం ఆర్డీ రమణ ప్రసాద్, సంక్షేమ శాఖ అధికారి కుమార్ రెడ్డి తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫ్లెమింగో ఫెస్టివల్‌కు వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకల వసతులతో పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రత, పారిశుధ్యం, రవాణా, బోటింగ్ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
అనంతరం టూరిజం శాఖకు సంబంధించిన బ్రోచర్‌ను కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.