ఇంటర్ విద్యా బలోపేతానికి గ్రామ పంచాయతీల పూర్తి సహకారం

•ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ మామిడి రాజు హామీమనకొండూరు,జనవరి3(మనప్రజాప్రతినిధి):ఇంటర్ విద్యా ప్రమాణాల పెంపు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధికి గ్రామ పంచాయతీలు తమ వంతు సహకారం అందిస్తాయ ని ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ మామిడి రాజు స్పష్టం చేశారు.ఇల్లంతకుంట మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లను ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దేవరాజం ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించిన సందర్భంగా ఈ సమావేశం జరిగింది. మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు ఈ కార్యక్రమానికి హాజరై విద్యా అభివృద్ధిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.కళాశాల విద్యార్థుల హాజరు పెంపు,...