manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 8:50 am Editor : Mana Praja Prathinidhi

ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును కలిసిన కాంగ్రెస్ నేతలు

పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ
మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లిమండలం.జనవరి28
దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్‌లోని వారి నివాసంలో ఎమ్మెల్యే రోహిత్ రావు.మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రానున్న రాజకీయ పరిణామాలు, దుబ్బాక నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు అక్కపల్లి బాల్ నర్స్ గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్, మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు యాదవ్, మాజీ ఎంపీటీసీ పాతూరి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ పెరిక మధు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కూతురు సుమలత, చాట్లపల్లి బాలా గౌడ్, ఉప సర్పంచులు జీడిపల్లి రమేష్, రాచమల్లు స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మెర శ్రీధర్, సోలిపేట ప్రసాద్ రెడ్డి, పోతారం ప్రతాప్, బాల్తే వెంకటేశం, కూతురు కుమారస్వామి, పాతూరి వెంకట్ రెడ్డి, కాకి కొండలు, బండి స్వామి గౌడ్, పయ్యావుల భూమయ్య, తిప్పనబోయిన స్వామి తదితరులు పాల్గొన్నారు.