manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 11:05 am Posted by : Mana Praja Prathinidhi

మాజీ ఎంపీటీసీ బెండ రమేష్ చేతుల మీదుగా యువతకు క్రికెట్ కిట్లు అందజేత

మెదక్,మనప్రజాప్రతినిధి//జనవరి12:
మెదక్ మండలం యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మాజీ ఎంపీటీసీ బెండ రమేష్ గారి చేతుల మీదుగా యువతకు క్రికెట్ కిట్లు. క్రికెట్ సామాగ్రి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం మైనంపల్లి హనుమంతన్న జన్మదినోత్సవ సందర్భంగా జాన్కంపల్లి గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ క్రమంలో జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నెల్లి నర్సిలు, ఉప సర్పంచ్ దివిటి వెంకటేశం, గుట్టకింది పల్లి సర్పంచ్ చింతల వెంకట్ తదితర స్థానిక నేతలు పాల్గొన్నారు. జాన్కంపల్లి గ్రామం తరపున రమేష్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయబడినవి.