•క్రీడలతో ఆరోగ్యం,క్రమశిక్షణ పెంపొందాలి:దుద్దెడ రాజు
మనకొండూరు.మనప్రజాప్రతినిధి//జనవరి19
ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో కింగ్స్ లెవన్ పీఎల్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో క్రీడాకారులకు దుద్దెడ రాజు (దేవి దుర్గా మెడికల్) ప్రథమ చికిత్సకు అవసరమైన మెడికల్ కిట్, మందులను సోమవారం అందజేశారు.ఈ సందర్భంగా దుద్దెడ రాజు మాట్లాడుతూ, క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగించడంతో పాటు యువతను చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉంచుతాయని తెలిపారు. క్రమశిక్షణతో ప్రవర్తిస్తూ చదువు, క్రీడలు సహా అన్ని రంగాల్లో యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. క్రీడల ద్వారా ఆరోగ్యం, స్నేహభావం, క్రమశిక్షణ పెంపొందుతాయని పేర్కొంటూ క్రీడా స్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు సూచించారు.అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు మెడికల్ కిట్ అందజేసినందుకు దుద్దెడ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్ రెడ్డి, అనిల్ కుమార్, సాయి, వేణు, రజినీకాంత్‌తో పాటు యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.