చదువు ఖరీదైంది భవిష్యత్ బానిసయ్యింది?
- విద్యా వ్యయం ఆకాశమే హద్దా?- అప్పుల్లో మొదలయ్యే యువత జీవితం- ప్రభుత్వ విద్య ఎందుకు బలహీనమైంది?జనవరి 6 (మనప్రజాప్రతినిధి):ఒకప్పుడు చదువు అంటే జీవితానికి వెలుగునిచ్చే మార్గంగా భావించేవారు. నేటి పరిస్థితుల్లో అదే చదువు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది. స్కూల్ నుంచి డిగ్రీ వరకూ ఫీజులు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను సేవగా కాకుండా లాభాల వ్యాపారంగా మార్చేశాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.- అప్పుల్లో మొదలయ్యే యువత జీవితండిగ్రీ పూర్తయ్యేలోపే...