ప్రభుత్వ భూములకూ కంచెలు… నిద్రలోనే తిరుపతి జిల్లా రెవెన్యూ యంత్రాంగం?

•సిపిఎం ఫిర్యాదుతో వెలుగులోకి ప్రభుత్వభూముల ఆక్రమణలు… 6ఎకరాల దందాపై సర్వే•అమ్మచెరువు పరిధిలో అక్రమాల గుట్టు విప్పిన సర్వే…ధ్వంసమైన సర్వే రాళ్లు•నోటీసులకూ లెక్కచేయని భూకబ్జాదారులు…రాజకీయ పలుకుబడితో రెచ్చిపోతున్న అక్రమాలు మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.జనవరి23సిపిఎం ఫిర్యాదు మేరకు శ్రీకాళహస్తి మండలం అమ్మ చెరువు రెవెన్యూ పరిధిలో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ యంత్రాంగం గురువారం సర్వే నిర్వహించింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు జిల్లా కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు ఆధారంగా వీఆర్వో లోకేష్, వీఆర్ఏలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.ఈ సర్వేలో సర్వే నంబర్లు 9,10,11పరిధిలో సుమారు...