manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 1:23 pm Posted by : Mana Praja Prathinidhi

సంక్రాంతి సందర్భంగా చందంపేట గ్రామస్తులకు ఆర్థిక భరోసా

పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు,ఆడబిడ్డలకు–మృత కుటుంబాలకు ఆర్థిక సహాయం:ఉప్పుల శివకుమార్
మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//జనవరి19
సంక్రాంతి పండుగ.నూతన సంవత్సరం సందర్భంగా మెదక్ జిల్లా చందంపేట గ్రామ ప్రజలకు మాజీ ఎంపీటీసీ ఉప్పుల శివకుమార్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చందంపేట గ్రామంలో జన్మించిన ప్రతి ఒక్కరి పేరున పోస్ట్ ఆఫీస్‌లో డిపాజిట్ చేయడం తన మాటగా ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అదేవిధంగా గ్రామంలోని ఆడబిడ్డలకు రూ.2,500, అలాగే ఇటీవల మరణించిన కుటుంబాలకు రూ.2,500 చొప్పున తన సొంత డబ్బుతో ఆర్థిక సహాయం అందిస్తానని వెల్లడించారు.ఇకపై కూడా గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వ సహాయానికి అతీతంగా తన వ్యక్తిగత నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఉప్పుల శివకుమార్ స్పష్టం చేశారు. ఆయన సేవాభావాన్ని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.