మేడారం మహా జాతరకు మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

- కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు- సంప్రదాయబద్ధంగా జాతర… రాజకీయాలకు అతీతంగా ఆహ్వానంహైదరాబాద్, జనవరి 8 (మనప్రజాప్రతినిధి): ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును హాజరుకావాల్సిందిగా రాష్ట్ర మంత్రులు ఆహ్వానించారు. మేడారం జాతర ఆహ్వాన పత్రికతో పాటు తల్లుల బంగారం, బట్టలను కేసీఆర్ దంపతులకు బహుకరిస్తూ సంప్రదాయబద్ధంగా ఆహ్వానం అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు తానే స్వయంగా మేడారం...