సమ్మక్క సారక్క జాతర ఉత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
•జాతర వేదికగా సమ్మక్క సారలమ్మ త్యాగ గాథను స్మరించిన మాజీ ఎమ్మెల్యేమనప్రజాప్రతినిధి//మనకొండూరు.జనవరి29ఇల్లంతకుంట మండల కేంద్రంలో వైభవంగా నిర్వహించిన సమ్మక్క సారక్క జాతర ఉత్సవంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. జాతర కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ..తెలంగాణ చరిత్రలో అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన పోరాట గాథకు, త్యాగానికి సమ్మక్క సారలమ్మ ప్రతీకగా నిలిచారని అన్నారు. సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖసంతోషాలు, సమృద్ధి కలగాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల...