పెదకాకానిలో 14 మంది గంజాయి ముఠా అరెస్ట్

గుంటూరు జనవరి 4 (మనప్రజాప్రతినిధి ) గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులతో పాటు వినియోగిస్తున్న 10 మందిని పెదకాకాని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. నిందితుల నుండి 86 వేల విలువైన4.95కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పెదకాకాని గ్రామంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పాడుబడిన రేకుల షెడ్ఢులో గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో తమ సిబ్బంది దాడులు చేసి వారిని...