కొండపాకమండలం.మనప్రజాప్రతినిధి//జనవరి15
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద బాలికలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కొండపాక మండల పరిధిలో 2018లో ప్రారంభమైన శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతన విద్యాసంస్థలు 12 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి సౌందర్యం మధ్య విద్యను అందిస్తున్నా యి.ఈ విద్యాసంస్థలో ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు తల్లిదండ్రులకు రూపాయి భారం లేకుండా ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తున్నట్లు కళాశాల చైర్‌పర్సన్, ప్రిన్సిపల్ పూర్ణిమ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా బాలికలకు పూర్తిగా ఉచిత విద్య కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.ఈ సంస్థలో చేరిన విద్యార్థులకు. ఉచితవిద్య.హాస్టల్ వసతి.పుస్తకాలు,దుస్తులుభోజనం.అన్నిపూర్తిగా. ఉచితంగా అందజేస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు, గుర్తింపుతో విలువలతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు.విద్యతో పాటు నాట్యం, సంగీతం, క్రీడలు, కంప్యూటర్ విద్య, అప్లికేషన్ శిక్షణను కూడా అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా గోశాల నిర్వహిస్తూ, అక్కడి పాలు, పెరుగు, నెయ్యిని విద్యార్థుల కోసం వినియోగిస్తున్నారు. అలాగే క్యాంపస్‌లోనే ప్రకృతి సిద్ధమైన కూరగాయలను పండిస్తున్నారు.ఇక్కడ చదువు పూర్తిచేసిన బాలికలు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ ఉమెన్ ఎక్సలెన్స్ ద్వారా డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ వరకు విద్యను కొనసాగించవచ్చు. పీజీ విద్యార్థులకు ప్రతినెల ఉపకార వేతనం కూడా అందిస్తారు. ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలపై భరోసా ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈనెల 20వ తేదీ వరకు ప్రవేశాలు కొనసాగుతాయని, గ్రామీణ పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రస్టు నిర్వాహకులు కోరారు. ఒక జత దుస్తులతో వస్తే చాలు, భారతీయ సనాతన గురుకుల విద్యను పూర్తిగా ఉచితంగా అందిస్తామని తెలిపారు.క్యాంపస్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం
👉 https://ssspnk.org/ ను సంప్రదించవచ్చు.