manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 01 January 2026, 1:17 am Posted by : Mana Praja Prathinidhi

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందుల ఉచిత పంపిణీ,

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్31
కొండపాక మండలంలోని మర్పడ్గ గ్రామంలో బుధవారం రోజున జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ ఆకారం బాలరాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బర్ల సంతోష్ యాదవ్, పశువైద్యాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బాలరాజ్ మాట్లాడుతూ… ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గొర్రెలు, మేకలు వంటి జీవాలకు నట్టల నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ మందుల వలన జీవాలు నులిపురుగుల బారిన పడకుండా ఉండటంతో పాటు, పోషకాలు సమర్థంగా గ్రహించి బరువు పెరగడం, వేగంగా వృద్ధి చెందడం జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా మరణాల రేటు తగ్గి, చివరికి గొర్రెలు–మేకల పెంపకందారుల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు.
రైతులు తమ జీవాలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పశువైద్యాధి కారుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సాయి, చందు, రైతులు తదితరులు పాల్గొన్నారు.