డ్రైవర్లకు ఉచిత కంటి, ఆరోగ్య పరీక్షల శిబిరం
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి4రవాణా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో డ్రైవర్ల కోసం ప్రత్యేక ఉచిత కంటి, సాధారణ ఆరోగ్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సుమారు 200 మంది సరుకు రవాణా, ప్రయాణికుల వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.ప్రమాదాల నివారణే ధ్యేయంఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి (DTO) లక్ష్మణ్ మాట్లాడుతూ, డ్రైవర్లకు మంచి కంటి చూపు ఉండటం ద్వారానే రోడ్డు ప్రమాదాలను...