మెదక్ జిల్లా మత్స్య శాఖ అధ్యక్షుడిగా గడప దేవేందర్ నియామకం.
మెదక్,జనవరి28(మనప్రజాప్రతినిధి)మెదక్ జిల్లా మత్స్య శాఖ అధ్యక్షుడిగా తూప్రాన్ పట్టణానికి చెందిన గడప దేవేందర్‌ను ప్రభుత్వం నియమించింది. తెలంగాణ సహకార సంఘాల చట్టం–1964లోని సెక్షన్ 32(7)(a)(i) ప్రకారం జిల్లా మత్స్యకార సహకార సంఘం వ్యవహారాలను నిర్వహించే పర్సన్-ఇన్-ఛార్జ్‌గా ఆయనను నియమిస్తూ మత్స్య శాఖ డైరెక్టర్ & ఎక్స్-ఆఫీషియో రిజిస్ట్రార్ కె. నిఖిల ఐఏఎస్ జనవరి 24, 2026న ఉత్తర్వులు జారీ చేశారు.రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో ఈ నియామకం జరిగినట్లు సమాచారం. జిల్లా స్థాయిలో మత్స్యకార సహకార సంఘాలను బలోపేతం చేయడం,...