manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 3:19 pm Editor : Mana Praja Prathinidhi

సిరిసిల్లలో ముఠా అరెస్ట్: 9mm పిస్టల్, 5 సజీవ తూటాలు స్వాధీనం

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి7
జనశక్తి పేరుతో ప్రజలను బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడేందుకు ప్రయత్నించిన నలుగురు సభ్యుల ముఠాను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక 9mm పిస్టల్‌తో పాటు 5 సజీవ తూటాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, ఐపీఎస్ బుధవారం మీడియాకు వెల్లడించారు. జనశక్తి కార్యకలాపాల ముసుగులో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ, ప్రముఖులను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని యత్నిస్తున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందినట్లు ఎస్పీ తెలిపారు.ఈ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు తంగళ్లపల్లి గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద మారణాయుధాలు బయటపడ్డాయి.అరెస్టయిన నిందితులు:
పోలీసుల కథనం ప్రకారం, అరెస్టయిన వారిలో ముగ్గురికి గతంలో నిషేధిత జనశక్తి సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
తోకల శ్రీకాంత్ (34) – రామన్నపల్లి, తంగళ్లపల్లి మండలం (మాజీ జనశక్తి సభ్యుడు)దాసరి తిరుపతి (43) – ఆటో డ్రైవర్, సారంపల్లి, తంగళ్లపల్లి మండలం.వంజరి సురేందర్ @ విశ్వనాథ్ (57)-వెల్గటూ ర్ మండలం, జగిత్యాల జిల్లా (మాజీ జనశక్తి సభ్యుడు)పయ్యావుల గోవర్ధన్ (31) – ఇల్లంతకుంట మండలం (మాజీ జనశక్తి సభ్యుడు)
ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ,“ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతాం. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించే ప్రసక్తే లేదు,” అని హెచ్చరించారు.
నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.