సిరిసిల్లలో ముఠా అరెస్ట్: 9mm పిస్టల్, 5 సజీవ తూటాలు స్వాధీనం
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి7జనశక్తి పేరుతో ప్రజలను బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడేందుకు ప్రయత్నించిన నలుగురు సభ్యుల ముఠాను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక 9mm పిస్టల్‌తో పాటు 5 సజీవ తూటాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, ఐపీఎస్ బుధవారం మీడియాకు వెల్లడించారు. జనశక్తి కార్యకలాపాల ముసుగులో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ, ప్రముఖులను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని యత్నిస్తున్నట్లు పోలీసులకు నమ్మదగిన...