•పశు వైద్య శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి గురువారెడ్డి
•బండారుపల్లిలో ఉచిత పశు వైద్య మందుల పంపిణీ
మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం,జనవరి19
ఏర్పేడు మండలం బండారుపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన పశు వైద్య శిబిరం పాడి రైతులకు ఊరటనిచ్చింది. ఈ శిబిరంలో రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి పాల్గొని ప్రభుత్వం తరఫున పాడి రైతులకు ఉచిత మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, రైతుల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు గుర్తించి అవసరమైన సహాయం అందిస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజ నాయుడు, వెటర్నరీ డాక్టర్ మోహన్, మండల పార్టీ నాయకులు మనోహర నాయుడు, గ్రామ పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం యాదవ్, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి నాదమునిశెట్టి, పార్టీ నాయకులు ముని కృష్ణారెడ్డి, గురువారెడ్డి సుధాకర్, హరి భాస్కర్, మీనా కుమార్తో పాటు పశు వైద్య అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.పాడి రైతులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.