సిరిసిల్లలో ‘కాత్యాయని’ కంటి ఆసుపత్రి ప్రారంభించిన ప్రభుత్వ విప్
మనప్రజాప్రతినిధి/ రాజన్నసిరిసిల్ల జనవరి ,04రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాత్యాయని కంటి ఆసుపత్రిని ఆదివారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం, అక్కడ అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య పరికరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సిరిసిల్ల వంటి పట్టణాల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన కంటి ఆసుపత్రులు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ఖర్చుతో...