manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 10:13 am Editor : Mana Praja Prathinidhi

భూంపల్లిలో సీసీ రోడ్డు, కల్వాటు పనులకు భూమి పూజ

ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్–భూంపల్లి మండలం.సిద్దిపేట జిల్లా.జనవరి 10
అక్బర్‌పేట్–భూంపల్లి మండల పరిధిలోని భూంపల్లి గ్రామంలో ప్రజలకు ఎంతోకాలంగా ఇబ్బందిగా మారిన మట్టి రోడ్డు సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య గారు భూమి పూజ చేసి ప్రారంభించారు.
అదేవిధంగా ఖాజీపూర్–బేగంపేట నుంచి గుర్రాలపల్లి వెళ్లే రహదారిలో నీటి కాలువ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో, ఆ సమస్యకు పరిష్కారంగా కల్వాటు నిర్మాణానికి కూడా భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ శంకర్, డిప్యూటీ శిరీష, ఏఈ ఉదయ్, మిరుదొడ్డి ఏఈ శ్రీనివాస్‌తో పాటు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అలాగే భూంపల్లి సర్పంచ్ జన్నారెడ్డి, బేగంపేట సర్పంచ్ చంద్రం, ఖాజీపూర్ సర్పంచ్ భాగ్యలక్ష్మి–చిరంజీవి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరి సంయుక్త–శ్రీధర్, గ్రామస్తులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.