ఇళ్ల నిర్మాణదారులే టార్గెట్ – ఇటుకలు, ఇసుక పేరుతో దోపిడీ
•ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు…ఇద్దరు నిందితుల అరెస్ట్మనప్రజాప్రతినిధి//వేములవాడ.జనవరి22కొత్తగా ఇళ్లు నిర్మించుకునే అమాయక ప్రజలే లక్ష్యంగా తక్కువ ధరకే ఇటుకలు, ఇసుక, బేస్మెంట్ రాళ్లు సరఫరా చేస్తామని నమ్మించి నగదు దోచుకున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వరుస మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి అక్రమ దందాకు చెక్ పెట్టారు.కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన శివరాత్రి సదయ్య (60), ముద్దికుంట గ్రామానికి చెందిన గాదాసు రాజయ్య (50) ముఠాగా ఏర్పడి చుట్టుపక్కల మండలాల్లో తిరుగుతూ, కొత్త ఇళ్ల...