manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 5:58 am Editor : Mana Praja Prathinidhi

మనసునితాకిన మానవత్వం:”హిందూజ సహాయంతో దివ్యాంగురాలైన రజిత కొత్త ఆశలో

దివ్యాంగురాలు రజితకు ఆర్థికసాయం చేసినసెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిని “హిందూజ.
మెరిట్ స్కాలర్షిప్ నుంచిరూ.5,000సహాయం-మానవత్వానికి మారు పేరు
నంగునూరు,జనవరి16(మనప్రజాప్రతినిధి)
నంగునూరు మండలం నంగునూరు గ్రామానికి చెందిన దివ్యాంగురాలు రజితకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని చింత హిందూజ తన మెరిట్ స్కాలర్షిప్ నుండి రూ.5,000 ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.కరోనా కాలంలో రజిత భర్త ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ మరణించడంతో, దివ్యాంగురాలైన రజిత తన ముగ్గురు పిల్లల సంరక్షణ, పోషణ కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయాన్ని తెలంగాణ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ.దివ్యాంగుల స్వచ్ఛంద సంస్థల అసోసియేషన్ సిద్దిపేట నిర్వాహకులు బొంగోని శ్రీశైలం, పిల్లి అంజయ్య, జగన్ గంధమాలలు చింత హిందూజ దృష్టికి తీసుకెళ్లారు.దీనికి స్పందించిన హిందూజ సహృదయంతో ముందుకు వచ్చి తన మెరిట్ స్కాలర్షిప్ నుండి రూ.5,000ను రజితకు ఆర్థిక సహాయంగా అందించారు. ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ, తన కష్టకాలంలో ఆదుకున్న హిందూజకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో చింత హిందూజ కుటుంబ సభ్యులు, అంక్సాపూర్ విజయ్ కుమార్, జగన్, తాడూరు బంగారి రాజు తదితరులు పాల్గొన్నారు.