manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 8:27 am Posted by : Mana Praja Prathinidhi

సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.జనవరి21
ఇల్లంతకుంట మండలంలోని ఓగులాపూర్ గ్రామంలో 4వ వార్డు సభ్యులు నుక్కల శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్సై సిరిసిల్ల అశోక్ మాట్లాడుతూ… గ్రామంలో భద్రత పెంపొందించే లక్ష్యంతో, స్థానిక హనుమాన్ దేవాలయం సమీపంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో ప్రత్యేక చొరవ తీసుకున్న 4వ వార్డు సభ్యులు నుక్కల శ్రీశైలం యాదవ్‌ను అభినందించారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.