ఎర్పేడు మండలంలో అక్రమ వడ్డీ దందా:ప్రజల జీవితం నాశనం-సిపిఐ డిమాండ్ చర్యలు తీసుకోవాలి
మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్3తిరుపతి జిల్లా ఏర్పేడు మండల పరిధిలో అనుమతి లేని వడ్డీ వ్యాపారస్తులు పేద, మధ్యతరగతి కుటుంబాలను తీవ్రంగా వేధిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వడ్డీ వ్యాపారం రోజువారీ, వారపు, పదిహేను రోజుల వడ్డీ, నెలవడ్డీ ఇలా వివిధ పేర్లతో కొనసాగుతోంది. బాధితులు చెప్పినట్టే, రూ.100కు రూ.20 నుంచి రూ.40 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు.వడ్డీ చెల్లించలేని పరిస్థితిలో ద్విచక్ర వాహనాలు, ఇంట్లోని విలువైన వస్తువులను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటు న్నాయి. కొందరు వాహనాలను తమ అవసరాలకు వినియోగిస్తున్నా రన్న ఆరోపణలు...