manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 12:22 pm Editor : Mana Praja Prathinidhi

కల్లూరులో అక్రమ ఇసుక దందా

•ఏపీ నుంచి అక్రమంగా ఇసుక తరలింపు…ఎస్సై డి.హరిత దాడుల్లో లారీ పట్టివేత
•అనుమతిలేకుండా ఇసుక రవాణా-టిప్పర్ లారీ సీజ్
మనప్రజాప్రతినిధి//కల్లూరు.జనవరి26
కల్లూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా ఘటన వెలుగులోకి వచ్చింది. 26-01-2026న ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో నమ్మదగిన సమాచారంతో, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా తెలంగాణ రాష్ట్రం కల్లూరు మండలానికి ఇసుక తరలిస్తున్న ఏపీ-39 డబ్ల్యూ బీ-1347 నంబర్ గల టిప్పర్ లారీని స్థానిక ఎస్సై డి. హరిత సీజ్ చేశారు.లారీ డ్రైవర్ ఉప్పు దేవానందంను విచారించగా, ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన రేపాకుల రామకృష్ణ సూచనల మేరకు ఇసుక రవాణా చేస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అమ్మితే టన్నుకు కేవలం రూ.600 మాత్రమే లభిస్తుండగా, ఆంధ్రాకు సమీపంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని కల్లూరులో టన్నుకు రూ.1500 నుంచి రూ.2000 వరకు ధర లభిస్తుందని చెప్పి కల్లూరుకు రావాలని సూచించడంతో ఇక్కడికి వచ్చామని డ్రైవర్ తెలిపినట్లు సమాచారం.అనుమతి లేకుండా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి ఇసుక రవాణా చేయడం నేరమని పేర్కొన్న ఎస్సై డి. హరిత, లారీతో పాటు అందులో ఉన్న సుమారు 33 టన్నుల ఇసుకను సీజ్ చేసినట్లు తెలిపారు.