మనప్రజాప్రతినిధి//
రాజన్నసిరిసిల్ల
జనవరి ,06
గ్రామ అభివృద్ధిలో భాగస్వాములయ్యే ప్రజాప్రతినిధులను గౌరవించుకోవడం మన బాధ్యత అని నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం కొలనురు గ్రామంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులను సంఘం ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. వారితో పాటు గ్రామ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శి (సెక్రటరీ), కారోబర్ మరియు పారిశుద్ధ్య కార్మికులను కూడా ప్రత్యేకంగా సన్మానించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా కొనియాడారు.
గ్రామంలోని అన్ని వర్గాల అభివృద్ధికి నూతన పాలకమండలి కృషి చేయాలని సంఘం సభ్యులు కోరారు.
పంచాయతీ సిబ్బందిని గౌరవించడం ద్వారా వారిలో పని పట్ల మరింత ఉత్సాహం పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు, ముఖ్య సభ్యులు, మరియు యువకులు పాల్గొన్నారు