మనప్రజాప్రతినిధి//నర్సాపూర్
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం ధర్పల్లి గ్రామంలో కుమారుడు అక్షిత్ రెడ్డి జ్ఞాపకార్థం టేక్మాల్ శైలజ శేఖర్ రెడ్డి దంపతులు వారి కుమార్తె హర్షిత, సుదూర ప్రాంతం నుండి చదువుకోడానికి నడిచి వస్తున్న ఇద్దరు విద్యార్థినిలకు రెండు సైకిళ్ళు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ విద్యార్థినిల సమస్యను చెప్పిన వెంటనే తక్షణం స్పందించిన శేఖర్ రెడ్డి రెండు సైకిళ్ళు పంపిణీ చేయడం సంతోషకరమని భవిష్యత్తులో కూడా శేఖర్ రెడ్డి సేవలు పాఠశాలకు అందించాలని ఉపాధ్యాయులు అభినందించారు వారు శేఖర్ రెడ్డిని శాలువాతో సన్మానించారు అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో కుమారుడు హర్షిత్ రెడ్డి జ్ఞాపకార్థం చిన్నపిల్లలకు సుమారు 50 కుర్చీలు అందజేశారు,ఈ కార్యక్రమంలో శైలజ శేఖర్ రెడ్డి, సర్పంచ్ మానస మహిపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ తడకపల్లి మహేందర్,వార్డు నెంబర్ ప్రవీణ్ కుమార్ మాజీ నీటి సంఘం చైర్మన్ లింగారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ టైగర్ నరసింహ గౌడ్, పాండు, మాజీ ఎంపీటీసీ ఉప్పరి శ్రీనివాస్ ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.