manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 1:21 am Editor : Mana Praja Prathinidhi

నేరేడుచర్ల, మున్సిపాలిటీ ఎన్నికలలొ  బిజెపి సత్తా చాటుతున్నది బీజేపీ పార్టీ నేరేడుచర్ల  మాజీ మండల అధ్యక్షులు గొడ్డేటి పవన్ కుమార్ యాదవ్

మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల, జనవరి 22

కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి బిజెపి గెలుపుకు కృషి చేయాలనీ కార్యకర్తలకు కోరడము జరిగింది
గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు, చిల్లిగవ్వ ఇవ్వలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. మున్సిపాలిటీల్లో, అంతోఇంతో అభివృద్ధి పనులు జరిగాయంటే అవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అనేది ప్రజలకు తెలిసిన సత్యమని అన్నారు.అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నయాపైసా రాదనేది ఎంత సత్యమో, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది వృధా అనేది కూడా అంతే సత్యమన్నారు.రాబోయే మున్సిపాలిటీ ,ఎన్నికల్లో బిజెపికి ఓటు వేస్తేనే కేంద్రం నుండి నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు.