ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం-పేదల కలలకు రూపం ఇచ్చిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి

సదాశివపేట,జనవరి23(మనప్రజాప్రతినిధి):సదాశివపేట పట్టణం 4వ వార్డులోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఫర్వీన్ సుల్తానా, ఖాజా పాషాలకు మంజూరైన ఇంటి నిర్మాణాన్ని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి శుభారంభం చేశారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని అన్నారు. పేదల సొంతింటి కలలను మాటల్లోనే కాకుండా చేతల్లో చూపిస్తూ నిజం చేస్తోందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం అందుతున్నదని పేర్కొన్నారు.లబ్ధిదారులు ఫర్వీన్ సుల్తానా, ఖాజా పాషా మాట్లాడుతూ, జీవితంలో ఎప్పుడైనా సొంత ఇల్లు...