మామిడిపల్లి సీతారామస్వామి జాతర ఏర్పాట్ల పరిశీలన

•భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి: చందుర్తి సీఐ వెంకటేశ్వర్లుమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,జనవరి12:కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఈ నెల 18న జరగనున్న మాఘ అమావాస్య జాతర ఏర్పాట్లను చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి ఆయనతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్రమబద్ధమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, వాహనాల పార్కింగ్ వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఐ అధికారులకు...