manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 2:39 pm Posted by : Mana Praja Prathinidhi

మెప్మా స్వయం సహాయక సంఘ మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలు పంపిణీ.

“347స్వయం సహాయక సంఘాలకు రూ.1.05 కోట్లు…మహిళల ఆర్థిక సాధికారతకు మున్సిపాలిటీ ప్రత్యేక కృషి”

“వడ్డీ రహిత రుణాలతో మహిళల స్వయం సహాయక సంఘాల ఆర్థిక శక్తి పెంపుకు మున్సిపాలిటీ ప్రోత్సాహం”

సదాశివపేట,జనవరి19(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం బసవాసేవాసదన్ ఫంక్షన్ హాలులో మెప్మా స్వయం సహాయక సంఘ మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.2023-24-2024-25 సంవత్సరాల్లో బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు తీసుకున్న 347 స్వయం సహాయక సంఘాలకు మొత్తం రూ.1,05,80,941 రూపాయల చెక్కులు అందజేయడం జరిగింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ నిర్మల జగ్గారెడ్డి (టీఎస్ఐఐసి ఛైర్మన్), మున్సిపల్ కమిషనర్, ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మెప్మా రిసోర్స్ పర్సన్లు మరియు మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు పాల్గొన్నారు.కమిషనర్, పురపాలక సంఘం, సదాశివపేట