మాట నిలబెట్టుకున్న ఇటికేపల్లి గ్రామ సర్పంచ్ తమ్మలి రాజు
మనప్రజాప్రతినిధి//రాయికోడ్: స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన హామీని సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం ఇటికేపల్లి గ్రామ సర్పంచ్ తమ్మలి రాజు నిలబెట్టుకున్నారు. సర్పంచ్‌గా తనను గెలిపిస్తే గ్రామంలో నీటి సమస్య లేకుండా చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సర్పంచ్‍గా ప్రమాణ స్వీకారం చేసి రెండు వారాలు గడవక ముందే బోర్ వేయించి ఆదివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తమ్మలి రాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి భేషజాలకు పోకుండా అందరికి...