manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 1:14 pm Editor : Mana Praja Prathinidhi

కులమతాలకు అతీతంగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన జగ్గారెడ్డి

జగ్గారెడ్డి అనే పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. •తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దమ్మున్న నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి ఆయన.
సదాశివపేట,జనవరి11(మనప్రజాప్రతినిధి)
ఎందరో యువ నాయకులకు జగ్గారెడ్డి ఆదర్శం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి సైతం జగ్గారెడ్డి నాయకత్వాన్ని ఇష్టపడతారంటే ఆయన స్థాయి ఏంటో అర్థమవుతుంది.ఈ కాలంలో రాజకీయాల్లో పదవి దక్కితే సంపాదనపైనే దృష్టి పెట్టే నాయకులు ఎక్కువగా ఉన్నారు. కానీ పదవి ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడ్డ నాయకుడు జగ్గారెడ్డి. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ నిజమైన ఆపద్బంధువుగా మారారు.ఆపద వస్తే చాలు… ఆశగా జగ్గారెడ్డి ఇంటి వైపు చూసే ప్రజలకు “నేనున్నాను” అనే గుండె ధైర్యం ఇచ్చే ఏకైక నాయకుడు ఆయనే. కులం, మతం, జాతి, వర్గం అనే భేదం లేకుండా అందరినీ ఒకేలా చూసే విశాల హృదయం ఆయనది. ప్రతి క్షణం ప్రజల గురించే ఆలోచించే వ్యక్తిత్వం ఆయన సొంతం.తన ఇంటికి వచ్చిన వ్యక్తిని ఏనాడు ఖాళీ చేతులతో పంపని గుణం జగ్గారెడ్డికి ప్రత్యేకత. ఈనాటి సమాజానికి ఇలాంటి నాయకుడే అవసరం. పురాణాల్లో విన్న శిబి చక్రవర్తి, కర్ణుడు వంటి దాతలను మనం చూడలేము గానీ… వారు ఉంటే బహుశా మా జగ్గారెడ్డి లాగే ఉండేవారేమో. ఏది అడిగినా వెనుకాడకుండా ఇవ్వగల గుణం ఆయనకే సొంతం.
ప్రతి నాయకుడిలో వుండే ఏద