manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 2:05 pm Editor : Mana Praja Prathinidhi

గిరిజన కాలనీలో జనసేన సంక్రాంతి సంబరాలు-ప్రజల గుండెల్లో చోటు సంపాదించిన పేట బ్రదర్స్

సంక్రాంతి సంబరాలతో గిరిజన కాలనీలో ఆనందోత్సాహాలు
మహిళలు, పిల్లల కోసం పోటీలు-ప్రతి ఒక్కరికీ బహుమతులు
ప్రజలతో మమేకమైన జనసేన నాయకులు
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.జనవరి13
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పొయ్యపంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీలో జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్రబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు గిరిజన ప్రజల్లో విశేష ఉత్సాహాన్ని నింపాయి.సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు పరిగెత్తు పందాలు, మ్యూజికల్ చైర్స్ వంటి సాంస్కృతిక-వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయగా, పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బహుమతులు అందజేశారు.జనసేన నాయకులు ప్రజలతో మమేకమై నిర్వహించిన ఈ కార్యక్రమాలు గిరిజన కాలనీలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ వేడుకలను హర్షాతిరేకంగా స్వాగతించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ, గంధం శీను, డాక్టర్ నక్క ప్రసాద్, మహేశ్, మనీ, మహర్షి రెడ్డి, భాను ప్రకాష్, కళ్లిపూడి వెంకటేష్, నవీన్, ముని చంద్ర, చందు, గోపి పాల్గొన్నారు.
అలాగే వీర మహిళ, శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమానికి మరింత శోభ చేకూర్చారు.