గిరిజన కాలనీలో జనసేన సంక్రాంతి సంబరాలు-ప్రజల గుండెల్లో చోటు సంపాదించిన పేట బ్రదర్స్
•సంక్రాంతి సంబరాలతో గిరిజన కాలనీలో ఆనందోత్సాహాలు•మహిళలు, పిల్లల కోసం పోటీలు-ప్రతి ఒక్కరికీ బహుమతులు•ప్రజలతో మమేకమైన జనసేన నాయకులుమనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.జనవరి13శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పొయ్యపంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీలో జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్రబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు గిరిజన ప్రజల్లో విశేష ఉత్సాహాన్ని నింపాయి.సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు పరిగెత్తు పందాలు, మ్యూజికల్ చైర్స్ వంటి సాంస్కృతిక-వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయగా, పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బహుమతులు అందజేశారు.జనసేన నాయకులు ప్రజలతో మమేకమై...