manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 7:28 am Posted by : MANA PRAJA PRATINIDHI

వార్డు అభివృద్ధిని చూసి మళ్లీ గెలిపించండి

-14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గుంటుకు శిరీష-రాజు

మనప్రజాప్రతినిధి,గజ్వేల్

వార్డు అభివృద్ధి చూసి, భారీ మెజార్టీతో మళ్ళీ గెలిపించాలని 14వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గుంటుకు శిరీష-రాజు వార్డు ప్రజలను అభ్యర్థించారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో ఎన్నికల కోలాహలంలో భాగంగా బుధవారం 14వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా గుంటుకు శిరీష రాజు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. అంతకముందు, వార్డు నాయకులు, ప్రజలతో కలిసి స్థానిక సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,అనంతరం గజ్వేల్ ఐఓసీ కార్యాలయంలోని రిటర్నింగ్ ఆఫీసర్‌కు తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గుంటుకు శిరీష-రాజు మాట్లాడుతూ గతంలో వార్డు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి కౌన్సిలర్‌గా గెలిపించారని,వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వార్డు అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. చేసిన అభివృద్ధిని చూసి, ప్రజా సేవ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తున్నామన్నారు. వార్డు ప్రజలు మరోసారి మమ్మల్ని ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.