ప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి ,జనవరి 4:
తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మరోసారి బాలగురవం బాబు .ని నియమించిన సందర్భంగా వారిని పూలమాలతో,దూశాలువతో సన్మానించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి.
తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో బాలగురవం బాబు ఎనలేని కృషి చేశారని, వారి కృషిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరల వారికే జిల్లా పగ్గాలను అందించిందని, పార్టీలోని ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యులు లాగా ఆదరించి రాజకీయంగా ప్రతి ఒక్కరి ఎదుగుదలను కోరేవారని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, శ్రీకాళహస్తి మండల యువజన అధ్యక్షులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.