manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 3:46 am Editor : Mana Praja Prathinidhi

మల్లన్న సాగర్ రైట్ కెనాల్ పనులు త్వరలో పూర్తి: మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ..

•కొండపాక మండల రైతుల సమస్యలను మంత్రి ముందుంచిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి
నీటి సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ నాయకుల వినతి పత్రం

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి24
బందారం, మర్పడగా, అంకిరెడ్డిపల్లి, దర్గా గ్రామాలకు సంబంధించిన మల్లన్న సాగర్ రైట్ కెనాల్ కాలువ నిర్మాణంలో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం తూప్రాన్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం అందజేశారు.ఈ కాలువ నిర్మాణంలో భాగంగా మొత్తం 16 కిలో మీటర్లకు గాను ఇప్పటికే 11 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని, మిగిలిన 5 కిలోమీటర్ల కాల్వ పనులు ప్రారంభించాల్సి ఉందని మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ, మిగిలిన కాల్వ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించి పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ బట్ట పరశురాములు, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్, తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గౌడ్, బందారం సర్పంచ్ గంగాధర్, అడ్వకేట్ రాజు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.