manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 8:27 am Editor : Mana Praja Prathinidhi

మిరుదొడ్డి మండల లింగాయత్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

అధ్యక్షుడిగా పూడూరి శ్రీనివాస్,గౌరవాధ్యక్షుడిగా రాజమౌళి
మనప్రజాప్రతినిధి//మిరుదొడ్డిమండలం.జనవరి18
మిరుదొడ్డి మండలంలో వీరశైవ లింగాయత్–లింగ బలిజ సంఘం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా మండల లింగాయత్ అధ్యక్షుడిగా పూడూరి శ్రీనివాస్‌ను, గౌరవాధ్యక్షు డిగా రాజమౌళిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ముందుగా మండల లింగ బలిజ ప్రజలందరికీ నూతన కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేశారు. సిద్దిపేట నుండి మలుపల్లి వరకు ఉన్న వీరశైవ లింగాయత్–లింగ బలిజ పెద్దల సమక్షంలో ఈ ఎన్నికలు జరగడం విశేషమని నూతన అధ్యక్షుడు పూడూరి శ్రీనివాస్ తెలిపారు. సుమారు 20 నుంచి 30 మంది సభ్యులు హాజరై కమిటీని ఎన్నుకోవడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, మిరుదొడ్డి మండలంలో లింగాయత్ సమాజానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలోని కులస్తులందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడితో పాటు మండల వీరశైవ లింగాయత్ సభ్యులుగాజుల రాజమౌళి, పూడూరి రమేష్, పూడూరి భాస్కర్, పూడూరి వీరభద్ర స్వామి, పూడూరి రాజు, పూడూరి వీరేష్, ఆంజనేయులు, పూడూరి కృష్ణ, పూడూరి మహేష్, దినేష్, నరేష్, పూడూరి సుభాష్, సురేష్, పూడూరి రవి, అజేయ్, కార్తిక్, రఘు, చింటూ తదితరులు పాల్గొన్నారు.