సదాశివపేట క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సదాశివపేట,జనవరి 12(మనప్రజాప్రతినిధి):సదాశివపేట మండలానికి చెందిన వివిధ గ్రామాల లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సంగారెడ్డి నియోజకవర్గ గౌరవశాసనస భ్యులు శ్రీ చింతా ప్రభాకర్ గారు పంపిణీ చేశారు.సోమవారం రోజున సదాశివపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 21 మంది లబ్ధిదారులకు రూ.6,80,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మాట్లాడుతూ…నిరుపేద కుటుంబాల కు వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో...